మాగురించి

“టీచర్స్ ఆఫ్ ఇండియా”కు స్వాగతం:

అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ మరియు నేషనల్ నాలెడ్జ్ కమీషన్ వారు  సంయుక్తంగా నిర్వహిస్తోన్న “టీచర్స్ ఆఫ్ ఇండియా”  పోర్టల్  ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ శిక్షకులకు, విద్యారంగంలో పనిచేస్తున్న ఇతరులకు ఒక అంతర్జాల వేదిక.

వివిధ ప్రాంతీయ భాషలలో భోదించే ప్రభుత్వ ప్రాథమిక ఉపాధ్యాయులకు సహాయాన్ని అందించడం ఈ పోర్టల్ యొక్క ప్రాథమిక లక్ష్యం. కావున ఈ భాషలలో వనరులను ఏర్పరచడం,మరియు పంచుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం. ప్రస్తుతానికి ఆంగ్లంతో పాటు నాలుగు ప్రాంతీయ భాషలలో వివిధ విషయపరిజ్ఞానాల సమాచారం ఉంది. మీ యొక్క నిరంతర సహాయ సహకారాలతో త్వరలోనే మిగిలిన ఇతర భారతీయ భాషలలోకి విస్తరిస్తాము. ఈ వనరులన్నీ లాభాపేక్ష లేకుండా పని చేసే అన్ని విద్యాసంబంధ సంస్థలకు అందుబాటులో ఉంటాయి.

దేశవ్యాప్తంగా విద్యారంగంలోని విన్నూత్న ప్రయోగాలను, తరగతిగది వనరులను, ఉత్తమ బోధనా పద్ధతులను, తమ ఆలోచనలను, ఉపాధ్యాయులు సులభంగా పంచుకోవడానికి ఈ పోర్టల్ ఒక వేదికగా నిలుస్తుంది. ఇందులో వనరులు వివిధ రూపాలలో అంటే పత్రాలుగానూ (వ్యాసాలూ,కృత్యాలు, అభ్యాస పత్రాలు , పాఠ్య ప్రణాలికలు మొదలైనవి) మరియు దృశ్య, శ్రవణ సంబంధ రూపంలో లభిస్తాయి.

ఈ లక్ష్య సాధనకు దేశవ్యాప్తంగా విద్యారంగంలో పనిచేస్తున్న వివిధ సంస్థల సమాహారం  భాగస్వామ్యులుగా చేయూతనిస్తోంది. ఇందుకోసం మీరు కూడా వ్యక్తిగతంగా వనరులను అందించి తోడ్పడవచ్చు.

 

13894 registered users
5841 resources